Director Ponvannan and Saranya: ఎంబీబీఎస్ పూర్తి చేసిన సినీ నటి కుమార్తె..! 9 d ago
ఓ సినీ జంట తమ వారసులని సినిమాకు దూరంగా, డాక్టర్ లను చేయడం ఆసక్తికరంగా మారింది. తమిళ నటుడు దర్శకుడు పొన్వన్నన్, శరణ్య దంపతులకు చాందిని, ప్రియదర్శిని అనే ఇద్దరు కుమార్తెలు. తమ ఇద్దరు కుమార్తెలను వైద్యవిద్యను అభ్యసించేలా చేశారు. గత ఏడాది పెద్ద కూతురు చాందిని ఎంబీబీఎస్ పూర్తి చేయగా.. తాజాగా రెండొవ కూతురు ప్రియదర్శిని ఎంబీబీఎస్ పూర్తి చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.